యూఎస్ మార్కెట్ లో ‘చెన్నై లవ్ స్టోరీ’కి సాలిడ్ ఓపెనింగ్స్.. అప్పుడే లక్ష మార్క్

యూఎస్ మార్కెట్ లో ‘చెన్నై లవ్ స్టోరీ’కి సాలిడ్ ఓపెనింగ్స్.. అప్పుడే లక్ష మార్క్

Published on Jul 23, 2026 2:51 PM IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా యువ బ్యూటీ శ్రీ గౌరీ ప్రియా హీరోయిన్ గా దర్శకుడు రవి నంబూరి తెరకెక్కించిన అవైటెడ్ ప్రేమ కథా చిత్రమే ‘చెన్నై లవ్ స్టోరీ’. జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు సాయి రాజేష్ కథ అందించిన ఈ సినిమా నిన్ననే మెగాస్టార్ చిరంజీవి ప్రెజెన్స్ తో అట్టహాసంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది.

అయితే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బజ్ ఏమో కానీ యూఎస్ మార్కెట్ లో మాత్రం అదరగొడుతుంది అని చెప్పాలి. నార్త్ అమెరికా ప్రీ సేల్స్ లో చెన్నై లవ్ స్టోరీ చిత్రానికి ఆల్రెడీ లక్ష డాలర్స్ కి పైగా గ్రాస్ వచ్చేసింది. ఇది మాత్రం కిరణ్ అబ్బవరం కెరీర్లో మరో సాలిడ్ ఓపెనింగ్ అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రం మున్ముందు ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూడాలి. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించగా మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు