చెన్నై లవ్ స్టోరీ నైజాం డే 1కలెక్షన్స్.. కల్ట్..!

చెన్నై లవ్ స్టోరీ నైజాం డే 1కలెక్షన్స్.. కల్ట్..!

Published on Jul 25, 2026 8:00 PM IST

కల్ట్ బ్లాక్‌బస్టర్ ‘బేబీ’ కాంబినేషన్ సాయి రాజేష్ – SKN ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్, థియేటర్లలోకి వచ్చి విశేష ఆదరణతో దూసుకుపోతోంది. మణిశర్మ అందించిన మెలోడీస్, ఆకట్టుకునే ప్రమోషన్స్ వల్ల పెరిగిన హైప్.. బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్‌గా మారింది.

​నైజాం ఏరియాలో ఈ సినిమా మొదటి రోజే దాదాపు రూ. 2.15 కోట్ల షేర్ సాధించి, మిడ్-రేంజ్ సినిమాల్లో సరికొత్త రికార్డు నమోదు చేసింది. శ్రీ గౌరి ప్రియ హీరోయిన్ గా మెరవగా, త్రిగుణ్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించి మెప్పించారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ టాక్ ఆధారంగా రాబోయే రోజుల్లో కూడా ఈ మూవీ కలెక్షన్లు మరింత బలంగా ఉండే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు