‘రాకా’ కొత్త షెడ్యూల్ కోసం భారీ సెట్ ?

‘రాకా’ కొత్త షెడ్యూల్ కోసం భారీ సెట్ ?

Published on Jul 27, 2026 12:00 PM IST

raaka

‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ సినిమా ‘రాకా’ అప్ డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ గురించి వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎంట్రీ సీన్స్ ను షూట్ చేస్తారని టాక్. ఈ సీన్స్ కోసం భారీ సెట్ కూడా వేశారని, ఈ సీన్స్ లో బన్నీ వైల్డ్ లుక్ కనిపిస్తారని తెలుస్తోంది. భారీ స్థాయిలో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ అద్భుతంగా ఉంటుందట.

కాగా ఈ మూవీలో దీపికా పడుకోణె హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అన్నట్టు ఈ సినిమాలో దీపికా పడుకోణెతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే, జాన్వీ కపూర్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది. కాగా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం సాగుతుందట. అన్నట్టు సన్ పిక్చర్స్ వారు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు