రీసెంట్ గా మన తెలుగు సినిమా నుంచి వచ్చి సినీ ప్రముఖులు నుంచి మన్ననలు అందుకున్న చిత్రమే ‘రావు బహదూర్’. టాలెంటెడ్ పవర్ హౌస్ సత్యదేవ్ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు వెంకటేష్ మహా కలయికలో వచ్చిన ఈ రెండో చిత్రం డీసెంట్ పెర్ఫామెన్స్ చేసింది.
ఇక థియేటర్స్ లో నుంచి ఇప్పుడు ఫైనల్ గా ఓటిటిలో రిలీజ్ కి ఈ చిత్రం రాబోతుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వారు తాజాగా పాన్ ఇండియా డేట్ ఇచ్చేసారు. ఈ జూలై 31 నుంచే ఒరిజినల్ తెలుగు, డబ్బింగ్ భాషలు హిందీ, తమిళ్, కన్నడ సహా మలయాళ వెర్షన్ లలో అందుబాటులో ఉండనున్నట్టుగా ఖరారు చేశారు.
సో ఈ కాంబినేషన్ అంటే ఇంట్రెస్ట్ ఉండి అప్పుడు మిస్ అయ్యినవారు ఓటిటిలో ఈ చిత్రాన్ని చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి స్మరన్ సాయి సంగీతం అందించగా సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణం పరంగా తన సహకారం ఈ చిత్ర యూనిట్ కి అందించారు.


