మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, టాలెంటెడ్ డైరెక్టర్ పవన్ సాధినేని కాంబినేషన్‌లో వస్తున్న ఫీల్ గుడ్ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’. సాత్విక వీరవల్లి ఈ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమవుతోంది. కాగా దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘చిట్టి చిట్టి చీమ’ లిరికల్ వీడియోను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో హీరోయిన్ ఒక ఆస్ట్రోనాట్ కావాలని కలలు కంటుంది. ఆమె ఆశయాన్ని నెరవేర్చడానికి, నగర జీవితానికి అలవాటుపడుతూ పడే తపనకు హీరో తోడుగా నిలిచే నేపథ్యంలో ఈ పాట సాగుతుంది. శ్రీమణి అందించిన సాహిత్యం, జీవి ప్రకాష్ కుమార్ అందించిన స్వరాలు, రమ్య బెహరా ఆలపించిన తీరు శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. సుజిత్ సారంగ్ విజువల్స్ కూడా బాగున్నాయి.
గుణ్ణం గంగరాజు ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా, శృతి హాసన్ ఒక కీలక పాత్రలో నటిస్తోంది. లైట్ బాక్స్, స్వప్న సినిమాస్, వైజయంతీ మూవీస్ మరియు గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


