‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’, ఆ తర్వాత ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అయితే, టాలీవుడ్ నిర్మాత నాగవంశీ నిర్మాణంలో, అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఆయన చేయాల్సిన భారీ హిస్టారికల్ యాక్షన్ డ్రామా హఠాత్తుగా రద్దయినట్లు సమాచారం.
ఈ సినిమా ఆగిపోవడానికి రిషబ్ శెట్టి, నిర్మాత నాగవంశీ మధ్య రెమ్యునరేషన్ విషయంలో వచ్చిన అభిప్రాయ భేదాలే కారణమని తెలుస్తోంది. రెమ్యూనరేషన్‌పై ఇద్దరి మధ్య అంగీకారం కుదరకపోవడంతోనే ఈ ప్రాజెక్ట్ పక్కనబెట్టినట్లు టాక్ నడుస్తుండగా, దీనిపై ఇరువర్గాల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


