ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : జూలై 30, 2026
ఓటీటీ వేదిక : ఈటీవీ విన్
123తెలుగు.కామ్ రేటింగ్ 2.5/5
నటీనటులు : రవి మహాదాస్యం, మౌనిక రెడ్డి, సుజాత గారు తదితరులు
దర్శకత్వం : రవి మహాదాస్యం
నిర్మాతలు : రాహుల్ తమడా, సాయి దీప్ రెడ్డి
సంగీతం : భరత్ మంచిరాజు
ఛాయాగ్రహణం : ప్రణవ్
కూర్పు : శేఖర్ పుల్లూరి, సాయి కృష్ణ, హరీష్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ వేదికగా సరికొత్త ఎమోషనల్ ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘సెకండ్ మ్యారేజ్’ జూలై 30 నుంచి స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఈ సిరీస్‌లో రవి మహాదాస్యం, మౌనిక రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. మరి ఈ సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో రివ్యూలో చూద్దాం.
కథ :
ఆకాష్ (రవి మహాదాస్యం), చాందిని (మౌనిక రెడ్డి) ఇద్దరూ రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటారు. అయితే, గతం తాలూకు మానసిక గాయాలు, అనుమానాలు, భయాలు వీరి కొత్త ప్రయాణానికి ఆటంకంగా మారతాయి. ఒకే ఇంట్లో ఉంటూ కూడా ఒకరినొకరు పూర్తిగా నమ్మలేని స్థితిలో వీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? చివరకు ఆ గాయాల నుంచి బయటపడి ఒకటయ్యారా లేదా? అనేదే ఈ సిరీస్ కథ.
ప్లస్ పాయింట్స్ :
రెండో పెళ్లి చుట్టూ ఉండే భావోద్వేగాలను, గతం నుంచి బయటకు రావడం ఎంత కష్టమనే పాయింట్‌ను చాలా మెచ్యూర్గ్‌గా ప్రెజెంట్ చేయడం బాగుంది. రవి మహాదాస్యం నటుడిగానే కాకుండా పాత్రలోని డెప్త్‌ను బాగా పండించారు. మౌనిక రెడ్డి ఎమోషనల్ సీన్స్‌లో చాలా సహజంగా నటించింది.
ఆకాష్ – చాందిని మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సంభాషణలు, సుజాత గారి పాత్ర అందించే సపోర్టివ్ ఎలిమెంట్స్ కథకు బలాన్నిచ్చాయి. కొన్ని కీలకమైన సన్నివేశాల్లో భరత్ మంచిరాజు అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ డ్రామాని బాగా ఎలివేట్ చేసింది.
మైనస్ పాయింట్స్ :
ఈ సిరీస్ ప్రారంభం ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, ఎపిసోడ్లు గడిచేకొద్దీ స్క్రీన్‌ప్లే వేగం చాలా తగ్గిపోతుంది. మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నప్పటికీ, సన్నివేశాలు మాత్రం చాలా వరకు మనం రెగ్యులర్ డ్రామాల్లో చూసే తరహాలోనే సాగుతాయి.
కథనం నడిచే తీరు వల్ల తర్వాత ఏం జరుగుతుందో, క్లైమాక్స్ ఏంటో ప్రేక్షకుడు ముందుగానే సులభంగా ఊహించవచ్చు. కథలో కొన్ని సీన్లు మళ్లీ మళ్లీ రిపీట్ అయినట్టు అనిపిస్తాయి. ఎడిటింగ్ విభాగం మరింత జాగ్రత్త వహించి నిడివి తగ్గించి ఉంటే అవుట్‌పుట్ ఇంకా గ్రిప్పింగ్‌గా ఉండేది.
సాంకేతిక వర్గం :
రవి మహాదాస్యం ఆలోచన మెచ్చుకోదగ్గది అయినా, ఒక కథకుడిగా ఉన్న క్లారిటీని పూర్తిస్థాయి స్క్రీన్‌ప్లేగా మార్చడంలో, చివరి వరకు ఉత్కంఠను నిలబెట్టడంలో కొంత తడబడ్డాడు. ప్రణవ్ కెమెరా వర్క్ చాలా క్లీన్‌గా ఉంది. సీన్స్ ఆహ్లాదకరంగా ఉంటాయి. ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త షార్ప్‌గా ఉంటే బాగుండేది. తమడా మీడియా ప్రొడక్షన్ వాల్యూస్ ఈటీవీ విన్ సిరీస్‌లకు తగ్గట్టుగా నాణ్యంగా ఉన్నాయి.
తీర్పు :
ఓవరాల్‌గా చూసుకుంటే.. ‘సెకండ్ మ్యారేజ్’ వెబ్ సిరీస్ ఒక మంచి టాపిక్ మరియు నటీనటుల చక్కటి పర్ఫార్మెన్స్‌తో రూపొందింది. ప్యూర్ ఎమోషన్స్‌తో కథను నడిపించిన తీరు బాగుంది. అయితే, నెమ్మదిగా సాగే కథనం మరియు రొటీన్ సన్నివేశాలు సిరీస్‌పై ఆసక్తిని తగ్గిస్తాయి. ఎలాంటి ఇంట్రెస్టింగ్ ట్విస్టులు లేకపోవడం మైనస్. క్లీన్ ఫ్యామిలీ డ్రామాలను ఇష్టపడేవారికి ఈ సిరీస్ కొంతవరకు కనెక్ట్ కావచ్చు.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team


