అప్పుడు హర్ట్ అయ్యానంటున్న రితిక నాయక్.. ఎందుకంటే..?

అప్పుడు హర్ట్ అయ్యానంటున్న రితిక నాయక్.. ఎందుకంటే..?

Published on Jul 30, 2026 9:04 PM IST

మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న విశ్వక్ సేన్‌ను చాలా సాదాసీదా పెళ్లికొడుకుగా చూపించి, ప్రేక్షకులను మెప్పించిన సినిమా ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’. ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీలో మెయిన్ హీరోయిన్‌గా రుక్సర్ ధిల్లాన్‌ను ప్రమోట్ చేస్తూ, మరో నటి రితిక నాయక్ పాత్రను చిత్ర యూనిట్ సీక్రెట్‌గా దాచి ఉంచింది. సినిమా థియేటర్లలోకి వచ్చాకే రితిక క్యారెక్టర్ అసలు కథను నడిపిస్తుందని తెలిసింది. ఈ ప్లాన్ సినిమాకి పెద్ద ప్లస్ అయి, రితిక నటించిన తొలి చిత్రంతోనే ఆమెకు విశేషమైన ప్రశంసలు తెచ్చిపెట్టింది.

అయితే సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ ప్లాన్, పర్సనల్‌గా తనని ఎంతగానో బాధించిందని రితిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. మొదటి సినిమా ప్రమోషన్లలో టీమ్ అంతా సందడి చేస్తుంటే, తాను మాత్రం ఇంట్లో ఉండాల్సి రావడం తట్టుకోలేక తన స్నేహితురాలి దగ్గర తీవ్రంగా బాధపడినట్లు తెలిపింది. అయితే థియేటర్లలోకి వచ్చిన తర్వాత తన పాత్రపై వచ్చిన రెస్పాన్స్ చూశాక, ఆ సర్ ప్రైజ్ ఎలిమెంట్ కోసమే టీమ్ అలా చేసిందని, అదంతా తన మంచికే జరిగిందని అర్థమైందని ఆమె స్పష్టం చేసింది.

ఆ ఓర్పుకి లభించిన ప్రతిఫలమో ఏమో గానీ, డెబ్యూ తర్వాత రితిక కెరీర్ టాలీవుడ్‌లో స్పీడందుకుంది. తేజ సజ్జా సరసన నటించిన ‘మిరాయ్’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించగా, తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో ఆమె నటించిన ‘కొరియన్ కనకరాజు’ చిత్రం ఆగస్టు 7న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.

తాజా వార్తలు