Lenin OTT: ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న అయ్యగారి 100 కోట్ల బ్లాక్ బస్టర్.. ఎప్పుడు, ఎందులో అంటే!

Lenin OTT: ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న అయ్యగారి 100 కోట్ల బ్లాక్ బస్టర్.. ఎప్పుడు, ఎందులో అంటే!

Published on Aug 1, 2026 12:00 PM IST

అక్కినేని వారి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన సాలిడ్ ఎమోషనల్ యాక్షన్ చిత్రమే ‘లెనిన్’. అఖిల్, భాగ్యశ్రీ సహా వారి అభిమానులు మొత్తం టాలీవుడ్ కూడా వీరికి మంచి హిట్ దొరకాలని కోరుకున్న చిత్రమే ఇది.

ఇలా ఎంతో ఆలస్యం అయినప్పటికీ మంచి బజ్ నడుమ విడుదల అయ్యిన ఈ సినిమా ఆ అంచనాలు అందుకొని భారీ హిట్ అయ్యింది. ఇలా హిట్ అయ్యి అఖిల్ కెరీర్ లో మొదటి 100 కోట్ల గ్రాస్ బ్లాక్ బస్టర్ గా నిలిచి దుమ్ము లేపింది. ఇక ఫైనల్ గా ఈ చిత్రం థియేటర్స్ నుంచి ఇప్పుడు ఓటిటి రిలీజ్ కి సిద్ధం అయ్యింది.

ఈ చిత్రం తాలూకా ఓటిటి స్ట్రీమింగ్ హక్కులు జీ 5 వారు సొంతం చేసుకోగా ఇప్పుడు వారు లెనిన్ స్ట్రీమింగ్ డేట్ ఇచ్చేసారు. ఈ ఆగస్ట్ 7 నుంచి లెనిన్ ఓటిటిలో సందడి చేయనున్నట్టుగా వారు కన్ఫర్మ్ చేశారు. సో ఇది అక్కినేని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా ఈ నాగవంశీ, నాగార్జునలు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు