ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ‘రాకా’ కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమాని యువ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తుండగా దీనిని రెండు భాగాలుగా ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ బిగ్ ప్రాజెక్ట్ గా ప్లాన్ చేస్తున్నారు. అయితే రాకా విషయంలో మొదటి నుంచీ నెలకొన్న జాప్యంతో అల్లు అర్జున్ అభిమానులు తన ఆర్మీగా పిలుచుకునే ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్రస్ట్రేట్ అవుతున్నారు.
ఎప్పుడో ఏప్రిల్ లో అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా సినిమా లుక్, టైటిల్ ని మేకర్స్ రివీల్ చేశారు. కానీ దానికి ముందు చాలా గ్యాప్ ఉంది. దీనితో అసలు మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా సినిమా కొనసాగిస్తున్నారని బాధ పడ్డారు. ఇక ఏప్రిల్ లో వచ్చిన అప్డేట్ తర్వాత నుంచి మళ్ళీ చిన్న అప్డేట్ కాదు కదా హింట్ కూడా లేదు. దీనితో ఫ్యాన్స్ మరింత బాధ వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆగష్టులో ఏదొక అప్డేట్ ఉండొచ్చని టాక్ ఉంది. సో వీటిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ నిర్మాణం వహించారు.


