జూన్‌లో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న ఎమోషనల్ లవ్ డ్రామా మూవీ ‘దీవానా’ ప్రేక్షకులను మెప్పించింది. శ్రీకాంత్ సంఘీశెట్టి దర్శకత్వంలో హర్షిత్ రెడ్డి, స్నేహ మణిమేఘలై జంటగా నటించిన ఈ చిత్రం ఇటీవల ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది.
కేవలం రెండు వారాల్లోనే ఈ చిత్రం ఏకంగా 100 మిలియన్ మినిట్స్ వ్యూస్ సాధించి, ప్లాట్‌ఫామ్‌పై టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఇంటర్వెల్ ట్విస్ట్, తండ్రీ కొడుకుల ఎమోషన్ మరియు మనసుని ప్రేమించాలనే సందేశం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
థియేటర్లలో లాంగ్ రన్ కంటిన్యూ చేయలేని పెద్ద సినిమాలు కూడా డిజిటల్లో అద్భుతాలు చేయలేకపోతున్న ఈ రోజుల్లో, ‘దీవానా’ మాత్రం డిజిటల్ స్పేస్‌లో అదరగొడుతోంది. ముఖ్యంగా వేణు యెల్దండి లాయర్‌గా నటించిన పోలీస్ స్టేషన్ సీన్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ సినిమా రీచ్‌ను పెంచుతోంది. థియేటర్లో మిస్ అయిన లక్షలాది మంది వీక్షకులు ఇప్పుడు ఓటీటీలో ఈ చిత్రాన్ని ఆదరిస్తుండటంతో త్వరలో ఇది ఆల్‌టైమ్ అండర్ రేటెడ్ క్లాసిక్‌గా నిలవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.


