లేటెస్ట్ గా థియేటర్స్ లో అలరించడానికి వచ్చేస్తున్న అవైటెడ్ చిత్రమే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన అవైటెడ్ క్లీన్ ఫామిలీ ఎంటర్టైనర్ చిత్రమే ఇది. అయితే మేకర్స్ ఒరిజినల్ తమిళ్ సహా డబ్బింగ్ తెలుగు భాషల్లో ఈ ఆగష్టు 14న గ్రాండ్ గా విడుదలకి తీసుకొస్తుండగా అభిమానులు ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ సినిమా పట్ల మేకర్స్ బాగానే నమ్మకంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు కానీ ఇదే కాంబినేషన్ లో వచ్చిన గత హిట్ సినిమాలు వాథి/సార్ అలాగే లక్కీ భాస్కర్ ల తరహా కాన్ఫిడెన్స్ లేదా అనిపిస్తుంది. ముందు రెండు సినిమాలకి మేకర్స్ ఓ రోజు ముందే తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా పైడ్ ప్రీమియర్స్ ని సెట్ చేసి మరీ హిట్ కొట్టారు.
కానీ సూర్య సినిమా విషయంలో మాత్రం ఈ రిస్క్ తీసుకోకూడదు అనుకున్నారా? లేక ఆ రేంజ్ కాన్ఫిడెన్స్ లేదా అనేది వారికే తెలియాలి. సో ఈ సినిమా రిజల్ట్ ఏంటి అనేది తెలియాలి అంటే ఈ 14 వరకు ఆగాల్సిందే.


