‘ఇరుముడి’తో క్లాష్.. దుల్కర్ సినిమా వాయిదా!?

‘ఇరుముడి’తో క్లాష్.. దుల్కర్ సినిమా వాయిదా!?

Published on Aug 12, 2026 2:07 PM IST

ఈ ఆగష్టు నెలలో వరుస సినిమాలతో ప్యాకెడ్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ గత వారం వచ్చిన సినిమాలు ఎంతగానో అలరించాయి. గత వారం వచ్చిన సినిమాలు కూడా సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ని పంచి పెట్టగా వాటి తర్వాత ఈ వారం ఆ తదుపరి వారం కూడా వరుస సినిమాలు ఉన్నాయి.

అయితే ఈ చిత్రాల్లో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన అవైటెడ్ సినిమా ‘ఇరుముడి’ ఆల్రెడీ ఆగష్టు 21కి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాతో క్లాష్ లో 20న దుల్కర్ నటించిన ‘ఐమ్ గేమ్’ తెలుగు డబ్బింగ్ లో ఫిక్స్ అయ్యి ఉంది. దీనితో పాటుగా పృథ్వీ రాజ్ సుకుమారన్ నటించిన ఖలీఫా కూడా ఉంది.

అయితే ఈ క్లాష్ లో దుల్కర్ సినిమా మాత్రం ఇపుడు వాయిదా పడినట్టు తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణాల్లో సినిమా పనులు ఇంకా పూర్తి కాకపోవడం ఒకటైతే సినిమాపై అనుకున్న బజ్ కూడా లేకపోవడం మరో కారణం అన్నట్టు తెలుస్తుంది. పైగా సినిమా ప్రమోషన్స్ కూడా ఏమీ కనిపించడం లేదు. సో ఈ సినిమా వాయిదా అనేది ఖరారే అనుకోవాలి. ఇక కొత్త డేట్ ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి.

తాజా వార్తలు