‘రాకా’పై మంచు లక్ష్మీ వైరల్ కామెంట్స్.. నోరెళ్లబెట్టాల్సిందేనట..!

‘రాకా’పై మంచు లక్ష్మీ వైరల్ కామెంట్స్.. నోరెళ్లబెట్టాల్సిందేనట..!

Published on Aug 22, 2026 11:01 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘రాకా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో, సినీ సర్కిల్స్‌లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు అట్లీ ఓ సైఫై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా గ్రాండియర్ స్కేల్‌పై నటి మంచు లక్ష్మీ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఇటీవల తాను ‘రాకా’ సెట్స్‌కు వెళ్లానని.. అక్కడ జరుగుతున్న షూటింగ్ చూసి తాను నోరెళ్లబెట్టానని ఆమె పేర్కొంది. ఎవరూ ఊహించని ఓ కొత్త ప్రపంచం అక్కడ తాను చూశానని.. ఇప్పటివరకు తాను చూడని ప్రాణులు అక్కడ తనకు కనిపించాయని ఆమె పేర్కొంది. ‘రాకా’ సృష్టిస్తున్న ఈ విజువల్ వండర్ సినీ లవర్స్‌ను మెస్మరైజ్ చేయడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేసింది.

అల్లు అర్జున్, అట్లీ సృష్టించబోయే ఈ తుఫాను బాక్సాఫీస్ లెక్కలు తిరగరాయడం ఖాయమని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇక ఈ సినిమాలో బన్నీ వైవిధ్యమైన గెటప్స్‌లో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాడు. ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ప్రేక్షకులు ఆతృతగా చూస్తుంటే.. ఇప్పుడు మంచు లక్ష్మీ చేసిన కామెంట్స్ ఈ సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేశాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు