తెలుగులో స్పీచ్ అదరగొట్టిన యష్.. తెలుగు ప్రేక్షకులకు మొదటిసారి స్పెషల్ థాంక్స్ ఎందుకంటే!

తెలుగులో స్పీచ్ అదరగొట్టిన యష్.. తెలుగు ప్రేక్షకులకు మొదటిసారి స్పెషల్ థాంక్స్ ఎందుకంటే!

Published on Aug 23, 2026 12:56 AM IST

Toxic

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ చిత్రమే టాక్సిక్. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ బోల్డ్ యాక్షన్ డ్రామా తాలూకా గ్రాండ్ పీ రిలీజ్ ఈవెంట్ నేడు ఎంతో గ్రాండ్ గా తెలుగులో జరిగింది. అయితే మొదటిసారి ఓ తెలుగు గ్రాండ్ ఈవెంట్ కి హాజరైన యష్ తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ థాంక్స్ చెప్పుకొచ్చాడు.

తన కే జి యఫ్ సినిమాలు అంతగా ఆదరించిన సమయంలో తెలుగు ఆడియెన్స్ కి ధన్యవాదాలు చెప్పే అవకాశం రాలేదని. కానీ తనని ఇంతలా ఆదరించినందుకు ఇప్పుడు థాంక్స్ చెబుతున్నాను అని తెలుగులోనే స్పీచ్ ఇస్తూ ఎంతో ఓర్పుగా సహనంగా మాట్లాడి యష్ అదరగొట్టాడు. దీనితో తన స్పీచ్ వైరల్ గా మారింది. ఇక ఈ అవైటెడ్ సినిమా పాన్ ఇండియా భాషలతో పాటుగా ఇంగ్లీష్ లో కూడా ఈ ఆగస్టు 26న విడుదల కాబోతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు