రవితేజ సినీ కెరీర్ లోనే మరో మైలురాయి !

రవితేజ సినీ కెరీర్ లోనే మరో మైలురాయి !

Published on Aug 24, 2026 11:04 AM IST

రవితేజ నటించిన కొత్త సినిమా ‘ఇరుముడి’. ఈ సినిమాకి థియేటర్స్ లో వస్తున్న అద్భుతమైన స్పందన ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. పాజిటివ్ సమీక్షలు మరియు ప్రేక్షకుల నుంచి లభించిన భారీ ఆదరణ కారణంగా థియేటర్లకు జనం భారీగా తరలివస్తున్నారు. ఐతే, ఇక్కడ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం బలమైన వసూళ్లను సాధించడమే కాకుండా, అటు విదేశీ మార్కెట్‌లోనూ భారీ కలెక్షన్స్ ను రాబడుతుంది. ఈ చిత్రం ఉత్తర అమెరికాలో 1 మిలియన్ డాలర్ల వసూళ్ల మార్కును దాటింది.

ఆ ప్రాంతంలో ఈ ఘనత సాధించిన రవితేజ మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. సినిమా రిలీజ్ అయి మూడు నాలుగు రోజుల్లోనే ఈ స్థాయి విజయాన్ని అందుకోవడం నటుడిగా రవితేజ కెరీర్ లోనే ఒక అద్భుతమైన మైలురాయి. మొత్తానికి ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ డ్రామా మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.

తాజా వార్తలు