బాలయ్య బాబు – గోపీచంద్ మలినేని కలయికలో రాబోతున్న సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఐతే, ముగింపు దశలో ఉన్న ఈ సినిమాని డిసెంబరు 24న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే మిగిలిన షూట్‌ని శరవేగంగా ముగించేందుకు రెడీ అవుతున్నారు. గాయం కారణంగా ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న బాలయ్య త్వరలోనే తిరిగి ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ అవుతారట. ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటిస్తోంది. మంచు మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
అన్నట్టు త్వరలో స్టార్ట్ కానున్న షెడ్యూల్ లో సాంగ్ తో పాటు ఓ యాక్షన్ సీన్ ను కూడా షూట్ చేస్తారట. ఇక ఈ సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్ లో బాలయ్యను ఒక రాజుగా చూపించారు. బాలకృష్ణ – దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ మంచి విజయం సాధించింది. ఆ సినిమా తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న రెండో సినిమా ఇది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు.


