రవితేజ నెక్స్ట్ వెంచర్.. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ ఫిక్స్…!

రవితేజ నెక్స్ట్ వెంచర్.. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ ఫిక్స్…!

Published on Aug 28, 2026 9:00 PM IST

ప్రస్తుతం ‘ఇరుముడి’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి విజయాన్ని నమోదు చేస్తూ బ్లాక్‌బస్టర్ జోరుమీదున్నాడు మాస్ మహారాజ రవితేజ. ఈ చారిత్రాత్మక విజయం సాధించిన సందర్భంగా దర్శకుడు వివేక్ ఆత్రేయ, నిర్మాతలు లక్ష్మణ్ మరియు శ్రీను రవితేజను కలిసి ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సక్సెస్ జోష్ లోనే టాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్న రవితేజ, వివేక్ ఆత్రేయ కలయికలో ఓ కొత్త సినిమా తెరకెక్కనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ‘బ్రిడ్జ్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై రానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
​హసిత్ గోలి దర్శకత్వంలో రవితేజ చేయనున్న ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే ఈ కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

వివేక్ ఆత్రేయ ప్రత్యేకమైన సినిమాటిక్ వరల్డ్‌లో రవితేజను చూడటం అభిమానులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానుండగా, ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో ఈ కాంబినేషన్ భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు ఈ పవర్‌ఫుల్ కాంబో సిద్ధమవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు