తమిళ స్టార్ దర్శకుడు ఇప్పుడు హీరోగా మారిన లోకేష్ కనగరాజ్ నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ‘డిసి’ కోసం అందరికీ తెలిసిందే. తెలుగు, తమిళ్ లో భారీ హిట్ గా నిలిచిన ఈ సినిమాతో హీరోగా లోకేష్ కనగరాజ్ క్రేజీ వెల్కమ్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా థియేటర్స్ లో సాలిడ్ రన్ ని కంటిన్యూ చేసి ఎట్టకేలకి ఇప్పుడు ఓటిటి రిలీజ్ కి సిద్ధం అయ్యింది.
ఈ చిత్రాన్ని ఒకటి కాదు రెండు ఓటిటి ప్లాట్ ఫామ్ లు స్ట్రీమింగ్ కి తీసుకొస్తాయి అని టాక్ వినిపించిన నేపథ్యంలో వీటిలో ఒకటి అధికారిక అనౌన్సమెంట్ ని ఇచ్చేసింది. సన్ నెక్స్ట్ వారు డిసి చిత్రాన్ని అనధికారికంగా వినిపించిన డేట్ సెప్టెంబర్ 4 నుంచే అందుబాటులోకి తెస్తున్నట్టుగా ఖరారు చేశారు.
అయితే ఇందులో కేవలం తమిళ్ లోనే రావచ్చని మొదట వినిపించింది కానీ ట్విస్ట్ ఇస్తూ వీరు తమిళ్ తో పాటుగా తెలుగు, ఇంకా మలయాళం భాషల్లో కూడా ఈ చిత్రాన్ని తెస్తున్నట్టు తెలిపారు. సో ఈ డేట్ వరకు ఫ్యాన్స్ ఆగితే సరిపోతుంది. అలాగే ప్రైమ్ వీడియో వారి నుంచి అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా సన్ పిక్చర్స్ నిర్మాణం వహించారు.
The Mega Blockbuster of the year, #DC is all set to stream only on #SunNXT from September 4th in Tamil, Telugu & Malayalam
Experience the madness in Dolby Vision and Dolby Atmos! @Dir_Lokesh @ArunMatheswaran @anirudhofficial #WamiqaGabbi @isanjkayy @mukesh_DOP… pic.twitter.com/huxpEViqbr
— SUN NXT (@sunnxt) August 29, 2026


