టాక్.. ‘ఆదర్శ కుటుంబం’ వాయిదా? విశ్వంభర డేట్ కి రాబోతోందా?

టాక్.. ‘ఆదర్శ కుటుంబం’ వాయిదా? విశ్వంభర డేట్ కి రాబోతోందా?

Published on Aug 29, 2026 7:00 PM IST

వెంకీ మామ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమే ఆదర్శ కుటుంబం. మంచి బజ్ సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమాని సమ్మర్ నుంచి షిఫ్ట్ చేసి గాంధీ జయంతి రేస్ లో నిలిపారు. అయితే అక్టోబర్ 2 నుంచి కూడా సినిమా మళ్ళీ వాయిదా పడినట్టుగా సినీ వర్గాల్లో వినిపిస్తుంది.

దీని ప్రకారం సినిమా అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 16కి మారినట్టు తెలుస్తుంది. నిజానికి ఈ డేట్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఫాంటసీ వండర్ ‘విశ్వంభర’ ని లాక్ చేశారు. కానీ ఈ సినిమా వచ్చే ఛాన్స్ లేకపోవడంతో ఈ డేట్ లోకి వీరు షిఫ్ట్ అయినట్టు తెలుస్తుంది. ఆల్రెడీ ఇదే రేస్ లో రణబాలి, రజినీకాంత్ జైలర్ 2 కూడా ఉన్నాయి. సో వెంకీ మామ సినిమాపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ఈ హారికా హాసిని వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు