ట్విస్ట్: ‘డిసి’ రెండో ఓటిటి పార్ట్నర్ గా తప్పుకున్న ప్రముఖ సంస్థ?

ట్విస్ట్: ‘డిసి’ రెండో ఓటిటి పార్ట్నర్ గా తప్పుకున్న ప్రముఖ సంస్థ?

Published on Aug 30, 2026 6:02 PM IST

తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా వామికా గబ్బి అలాగే సంజన కృష్ణమూర్తి హీరోయిన్స్ గా దర్శకుడు అరుణ్ మాదేశ్వరన్ తెరకెక్కించిన సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామానే ‘డిసి’. ఈ ఆగష్టు 7న థియేటర్స్ లో విడుదల అయ్యిన ఈ చిత్రం తెలుగు సహా తమిళ్ లో మంచి హిట్ అయ్యి లోకేష్ కనగరాజ్ కి హీరోగా తన మొదటి సినిమాకే 100 కోట్ల గ్రాసర్ గా నిలిచింది.

అయితే ఈ సినిమా ఓటిటి రిలీజ్ విషయంలో గత కొన్ని రోజులు నుంచి పలు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో రెండు ఓటిటి ప్లాట్ ఫామ్ లు సన్ నెక్స్ట్ అలాగే ప్రైమ్ వీడియో లలో సినిమా ఈ సెప్టెంబర్ 4 నుంచి వస్తుంది అన్నట్టు రూమర్స్ వినిపించాయి. అయితే వీటిలో సన్ నెక్స్ట్ అఫీషియల్ డేట్ ని కూడా ఇచ్చేసారు.

కానీ తాజా ట్విస్ట్ ఏమిటంటే డిసి చిత్రం ప్రైమ్ వీడియోలో వచ్చేది లేదట. వారితో డీల్ క్యాన్సిల్ అయినట్టే కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రైమ్ వీడియోలో తమిళ్, తెలుగు కాకుండా హిందీ ఏమన్నా వస్తుందేమో చూడాలి. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు