సెన్సార్ పనులు ముగించుకున్న ‘మహేంద్రగిరి వారాహి’.. సుమంత్ ఈసారి గట్టిగా కొట్టేందుకు రెడీ..!

సెన్సార్ పనులు ముగించుకున్న ‘మహేంద్రగిరి వారాహి’.. సుమంత్ ఈసారి గట్టిగా కొట్టేందుకు రెడీ..!

Published on Sep 8, 2026 4:00 PM IST

టాలీవుడ్ హీరో సుమంత్ నటించిన సోషియో ఫాంటసీ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’ సెప్టెంబర్ 11న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయింది.

ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘యూ/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చింది. పురాతన మహేంద్రగిరి నేపథ్యంతో సాగే ఈ చిత్రం, వారాహి అమ్మవారికి సంబంధించిన ఒక రహస్యమైన తరాల శాపం చుట్టూ తిరుగుతుంది. ఒక రాజవంశానికి చెందిన పురుష వారసులు 33 ఏళ్ల వయస్సులోనే మరణిస్తుండటం, ఈ విషాదం గత 150 ఏళ్లుగా కొనసాగుతుండటం కథలో ముఖ్యమైన అంశం. ఈ మరణాలను దైవాగ్రహంగా భావిస్తున్న తరుణంలో, ఆ పురాతన రహస్యం వెనుక ఉన్న నిజాలను వెలికితీసి, ఆ శాపానికి ముగింపు పలకడానికి సుమంత్ పాత్ర ఎలా పోరాడింది అనేది చిత్ర ప్రధానాంశం.

ఈ సినిమాలో సుమంత్‌తో పాటు మీనాక్షి గోస్వామి, ఐశ్వర్య రాజేష్, మాళవికా నాయర్ కీలక పాత్రల్లో నటించగా, సిద్ధు జొన్నలగడ్డ ఒక క్యామియో పాత్రలో కనిపించనున్నాడు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు బ్రిడ్జ్ ఫిల్మ్స్ బ్యానర్లపై కాళిపు మధు, సురభి లక్ష్మణ్ రావు నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు