‘ఎపిక్’ అలాంటి సినిమా కాదు – నాగవంశీ

‘ఎపిక్’ అలాంటి సినిమా కాదు – నాగవంశీ

Published on Sep 8, 2026 9:04 PM IST

యంగ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ తెరకెక్కించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ చిత్రంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌పై సోషల్ మీడియాలో వస్తున్న రెస్పాన్స్ పై ఆయన స్పందిస్తూ.. “కేవలం ‘ఎపిక్’ ట్రైలర్ మాత్రమే చూసి సినిమాపై ఒక అంచనాకి వచ్చేయకండి. ఈ చిత్రంలో ప్రమోషనల్ కంటెంట్‌లో చూపించిన దానికంటే చాలా ఎక్కువ విషయాలు ఉన్నాయి” అని తెలిపారు.

సినిమాలో బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా, ఆకట్టుకునే లవ్ స్టోరీతో పాటు మనసును హత్తుకునే అనేక సన్నివేశాలు ఉన్నాయని నాగవంశీ పేర్కొన్నారు. థియేటర్లలో ఈ సినిమాని స్వయంగా చూసి ఆ అనుభూతిని పొందాలని ప్రేక్షకులను కోరారు.

అనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ చిత్రానికి సంబంధించి సెప్టెంబర్ 10న గ్రాండ్ ప్రిమియర్స్ ప్లాన్ చేశారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు