ఇండియన్ సినిమా వద్ద వచ్చిన పలు అవుట్ స్టాండింగ్ చిత్రాల్లో ఇండియన్ జేమ్స్ కేమెరూన్ శంకర్ తెరకెక్కించిన భారీ చిత్రంని ‘రోబో’ కూడా ఒకటి. 2010 లోనే పాన్ ఇండియా సినిమా రేంజ్ పెంచిన ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజినీకాంత్ స్టార్డం తోడయ్యి ఇండియన్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది.
ఇక అప్పట్లోనే 300 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకున్న ఈ చిత్రం రీరిలీజ్ అయితే చూద్దాం అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. కానీ ఇంట్రెస్టింగ్ గా ఈ గత కొన్ని రోజులు నుంచి సోషల్ మీడియాలో సడెన్ గా అందరిలో ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. సినిమాలో చూపించే అడ్వాన్స్డ్ ఎలిమెంట్స్ అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ వంటివి చాలా మంది పోస్ట్ చేస్తూ ఈ సినిమా రీరిలీజ్ ని డిమాండ్ చేస్తున్నారు.
అది కూడా సాదా సీదా రీరిలీజ్ కాకుండా అన్ని ప్రీమియం ఫార్మాట్ లలో ఈ ఎపిక్ చిత్రాన్ని రీరిలీజ్ చేయాలనే మాట ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. ఇలాంటి ఒక బిగ్గెస్ట్ సైఫై యాక్షన్ సినిమాకి, ఆ గ్రాండియర్ కి కేవలం 4కే రీరిలీజ్ సరిపోదని సన్ పిక్చర్స్ ఏదోకటి చేసి ఈ ఎపిక్ వండర్ ని గ్రాండ్ గా రీరిలీజ్ చేయాలనే కామెంట్స్ ఇపుడు అధికం అవుతున్నాయి.
మొదట తెలుగు యువత ఈ సినిమా పట్ల ఆసక్తి చూపించి స్టార్ట్ చేయగా అక్కడ నుంచి ఈ రీరిలీజ్ టాపిక్ మరింత వైరల్ గా మారింది. మరి ఈ క్రేజీ చిత్రం రీరిలీజ్ విషయంలో సన్ పిక్చర్స్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి. ఇక శంకర్ ప్రైమ్ టైంలో చేసిన ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ కంప్లీట్ హాలీవుడ్ లెవెల్ సంగీతం అందించగా ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా నటించింది.


