ఉత్తర అమెరికాలో ‘ది ప్యారడైజ్’కి ఫుల్ డిమాండ్ !

ఉత్తర అమెరికాలో ‘ది ప్యారడైజ్’కి ఫుల్ డిమాండ్ !

Published on Sep 14, 2026 5:00 PM IST

న్యాచురల్ స్టార్ నాని – శ్రీకాంత్ ఓదెల కలయికలో రాబోతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కావడానికి కేవలం మరో 10 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరోవైపు చిత్ర బృందం సినిమా విడుదలకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ చిత్రం ఉత్తర అమెరికాలో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది; ఈ సినిమా ప్రీమియర్ ప్రీ-సేల్స్ కు గానూ $250 వేల మార్కును దాటింది. ఇప్పటికే 10,000కు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. పూర్తి స్థాయి బుకింగ్‌లు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.

కేవలం ఈ ప్రారంభ జోరుతో, అదే ఉత్సాహాన్ని థియేటర్ విడుదలలో కూడా కొనసాగిస్తూ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాలని చిత్ర బృందం భావిస్తోంది. ఇక ఈ చిత్రంలో ప్రతినాయకుడైన ‘షికంజా మాలిక్’ పాత్రను మోహన్ బాబు పోషిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో రాఘవ్ జుయాల్, తనికెళ్ల భరణి, సంపూర్ణేష్ బాబు, బాబు మోహన్ మరియు సోనాలి కులకర్ణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. SLV సినిమాస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ స్థాయిలో ఈ పాన్-ఇండియా చిత్రం రూపొందుతోంది.

తాజా వార్తలు