రణబాలి : డౌట్ వద్దంటున్న విజయ్ దేవరకొండ అండ్ టీమ్..!

రణబాలి : డౌట్ వద్దంటున్న విజయ్ దేవరకొండ అండ్ టీమ్..!

Published on Sep 14, 2026 11:00 PM IST

విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రణబాలి’ విడుదల తేదీపై వస్తున్న వదంతులకు చిత్ర యూనిట్ తాజాగా చెక్ పెట్టింది. ఈ సినిమా అక్టోబర్ 16న అనుకున్న ప్రకారమే విడుదలవుతుందని, వస్తున్న వార్తలన్నీ కేవలం వదంతులేనని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది. మొదట సెప్టెంబర్ 11న విడుదల కావాల్సిన ఈ చిత్రం, ఆ తర్వాత దసరా కానుకగా అక్టోబర్ 16కి షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే.

అయితే, కొద్ది రోజులుగా ఈ విడుదల తేదీ కూడా మారుతుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో స్పందించిన చిత్ర బృందం, సినిమా షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరుగుతున్నాయని వెల్లడించింది. అంతేకాకుండా, ఇప్పటికే మొదటి హాఫ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పనులు కూడా పూర్తయినట్లు తెలిపారు.

రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ పాన్-ఇండియా చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అనుకున్న తేదీ కంటే ముందే అన్ని పనులు పూర్తి చేసుకుని, అక్టోబర్ 16న ‘రణబాలి’ ప్రేక్షకుల ముందుకు రానుందని అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు ఊరట చెందారు.

తాజా వార్తలు