ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలెంటెడ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ కలయికపై టాలీవుడ్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇటీవలే ముంబైలో ఈ ఇద్దరూ భేటీ కావడంతో వీరిద్దరి కాంబినేషన్లో త్వరలోనే ఒక సినిమా రానుందనే ప్రచారం ఫ్యాన్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఈ పరిణామాలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.
మరోవైపు, గత కొంతకాలంగా అల్లు అర్జున్ ఒకే సినిమా కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. కెరీర్ పీక్స్‌లో ఉన్న ఆయన ‘పుష్ప’, ‘రాకా’ లాంటి ప్రాజెక్ట్‌లతో ఏళ్లకు పైగా సమయం కేటాయించకుండా, మరింత వేగంగా సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ తర్వాత బాసిల్ జోసెఫ్ సినిమాను కూడా లైన్లో పెట్టడం ద్వారా తన సినిమాల వేగాన్ని పెంచాలని ఆయన వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది.


