‘ఆదర్శ కుటుంబం’ పై ఆ వార్త.. నిజమెంత ?

‘ఆదర్శ కుటుంబం’ పై ఆ వార్త.. నిజమెంత ?

Published on Sep 20, 2026 11:00 AM IST

విక్టరీ వెంకటేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం’. ఈ చిత్రం అక్టోబర్ 2న రిలీజ్ కాబోతుంది. ఐతే, లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం అక్టోబర్ 2 నుంచి రిలీజ్ ప్లాన్ మారే అవకాశం ఉందని, అక్టోబర్ 9 లేదా దసరా విండోలో విడుదలపై చర్చ జరిగినట్లు రిపోర్టులు ఉన్నాయి. కానీ, ఈ వార్త పై ఇంకా చిత్రబృందం అధికారికంగా స్పందించలేదు. ఏది ఏమైనా సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా, ఓపెనింగ్స్ భారీగా వచ్చే అవకాశం ఉంది.

సినిమాలో వెంకటేష్ కామెడీ, పైగా ఫ్యామిలీ ఎమోషన్.. దీనికితోడు ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ ను కూడా మిక్స్ చేసారు. కాబట్టి, ఈ ఎలిమెంట్స్ అన్ని సినిమా ఓపెనింగ్స్‌కు ప్లస్ కావచ్చు. ఎలాగూ దసరా సెలవుల ప్రభావం ఉంటుంది. బాక్సాఫీస్ కి ఈ సీజన్ బాగా కలిసి వస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది.

తాజా వార్తలు