‘జనవరి 12 విడుదల’.. ఆ ఎపిసోడే స్పెషల్ ?

‘జనవరి 12 విడుదల’.. ఆ ఎపిసోడే స్పెషల్ ?

Published on Sep 20, 2026 1:01 PM IST

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్‌రామ్ కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి తెరక్కిస్తున్న సినిమా ‘జనవరి 12 విడుదల’. కాగా ఈ సినిమా కామెడీ విషయంలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా గురించి మరో క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ‘వెంకీ – కళ్యాణ్ రామ్’ పై ఓ కామెడీ ఎపిసోడ్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఈ ఎపిసోడ్ సినిమా మొత్తానికే స్పెషల్ కామెడీ ఎపిసోడ్ లా ఉంటుందట. అనిల్ రావిపూడి మార్క్ పంచ్ లు ఈ ఎపిసోడ్ లో ఫుల్ గా ఉంటాయట.

ఇక ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సాహు గారపాటి నిర్మాణంలో రానున్న ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. అన్నట్టు ఈ సినిమాలో అల్ట్రా స్టైలిష్ లుక్‌లో వెంకీ కనిపిస్తారట.. ఈ లుక్ కి పూర్తి భిన్నంగా కళ్యాణ్ రామ్ లుక్ ఉంటుందని తెలుస్తోంది. పైగా స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. ఇక నవంబర్ లోపు ఈ సినిమా షూట్ పూర్తి చేయాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు. మొత్తానికి సంక్రాంతి ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేసేలా కామెడీ, ఎమోషన్, యాక్షన్ కలగలిసిన పూర్తి ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతుంది.

తాజా వార్తలు