హిస్టారికల్ కాంబినేషన్ మిస్: ‘రోబో’ కోసం మైఖేల్ జాక్సన్ తో ప్లాన్ చేసిన రెహమాన్.. షాకింగ్ ఫ్యాక్ట్ చెప్పిన థమన్

హిస్టారికల్ కాంబినేషన్ మిస్: ‘రోబో’ కోసం మైఖేల్ జాక్సన్ తో ప్లాన్ చేసిన రెహమాన్.. షాకింగ్ ఫ్యాక్ట్ చెప్పిన థమన్

Published on Sep 20, 2026 4:55 PM IST

ఇండియన్ సినిమా దగ్గర కొన్ని మర్చిపోలేని ఎపిక్ సెన్సేషనల్ హిట్ చిత్రాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఇండియన్ జేమ్స్ కేమెరూన్ శంకర్ ల కలయికలో వచ్చిన చిత్రం ‘రోబో’ కూడా ఒకటి. 2010 లోనే ఇండియన్ సినిమా వద్ద అప్పటి టైం కి మోస్ట్ అడ్వాన్స్డ్ గా తెరకెక్కించిన ఈ సినిమా సంచలన హిట్ అయ్యింది.

అయితే ఈ సినిమాకి పీక్ వర్క్ అందించిన వారిలో సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ కూడా ఒకరు. ఇప్పటికీ తన సాంగ్స్ ఫ్రెష్ గానే అనిపిస్తాయి. అయితే అప్పట్లో శంకర్ సినిమాలు అంటేనే భారీతనం ఊహించని కాంబినేషన్ లు.. అలానే ఈ సినిమా కోసం ఏకంగా అప్పటి, ఇప్పటికీ కింగ్ ఆఫ్ పాప్ గా పిలవబడే మైఖేల్ జాక్సన్ తో ఓ సాంగ్ ని ప్లాన్ చేసినట్టు సంగీత దర్శకుడు థమన్ రివీల్ చేయడం షాకింగ్ గా మారింది.

2009 మే నెలలో మైఖేల్ జాక్సన్ ని కలిసి సాంగ్ కోసం మాట్లాడ్డం జరిగింది జూన్ నెలలో ఆయన చనిపోయారు అని తెలిపాడు. ఒకవేళ ఆ సాంగ్ వచ్చి ఉంటే ఈపాటికి ఒక గొప్ప మెమొరీలా మిగిలిపోయి ఉండేది అని థమన్ తెలిపాడు. ఇక ఈ విషయం విన్న నెటిజన్స్ అంతా ఓ రేంజ్ లో షాకవుతున్నారు. అలాంటి పీక్ ని చూసిన శంకర్ కూడా ఈ రేంజ్ లో డౌన్ ఫాల్ చూడడంతో అభిమానులు కూడా తన కంబ్యాక్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజా వార్తలు