‘వారణాసి’ నుంచి విడుదల.. స్మార్ట్ లుక్ లోకి వచ్చేసిన మహేష్!

‘వారణాసి’ నుంచి విడుదల.. స్మార్ట్ లుక్ లోకి వచ్చేసిన మహేష్!

Published on Sep 25, 2026 10:13 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ చిత్రం ‘వారణాసి’ కోసం అందరికీ తెలిసిందే. భారీ హైప్ సెట్ చేసుకున్న ఈ చిత్రం నుంచి మహేష్ బాబు తన పోర్షన్ ని పూర్తి చేసుకున్నట్టుగా రీసెంట్ గానే కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఇప్పుడు దీన్ని అఫీషియల్ చేస్తూ సూపర్ స్టార్ కొత్త లుక్ లో దర్శనమివ్వడం ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుంది.

మహేష్ మళ్ళీ క్లీన్ షేవ్ లుక్ లోకి తాను రావడం ఇప్పుడు వైరల్ గా మారింది. వారణాసి కోసం ఫుల్ గడ్డం లుక్ లోకి మారిన సంగతి తెలిసిందే. ఫైనల్ గా తన పార్ట్ పూర్తి కావడంతో ఫైనల్ గా తనకి విడుదల దక్కి మళ్ళీ తన కంఫర్ట్ జోన్ లోకి వచ్చేసారు. కానీ ఫ్యాన్స్ మాత్రం మళ్ళీ తమ అభిమాన స్టార్ ని అదే ఛార్మింగ్ అండ్ స్మార్ట్ లుక్ లో కనిపించడం చూసి మురిసిపోతున్నారు. ఇక వారణాసి సినిమా గ్రాండ్ గా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు