‘జైలర్ 2’ అవైటెడ్ మాస్ సాంగ్ కి టైం ఫిక్స్!

‘జైలర్ 2’ అవైటెడ్ మాస్ సాంగ్ కి టైం ఫిక్స్!

Published on Sep 25, 2026 11:31 AM IST

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో చేసిన సాలిడ్ సీక్వెల్ చిత్రమే ‘జైలర్ 2’. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఒకో అప్డేట్ వరుసగా వదులుతూ వచ్చారు. ఇక ఈ సినిమా నుంచి ఆల్రెడీ వచ్చిన ఫస్ట్ సింగిల్ వచ్చి సూపర్ హిట్ అయ్యింది.

రెండో సాంగ్ గా సాలిడ్ మాస్ సాంగ్ ని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. నేడు విడుదల చేస్తామని ప్రకటించిన మేకర్స్ ఇపుడు సూపర్ స్టార్ పై ఓ స్టైలిష్ పోస్టర్ తో టైం ని కూడా లాక్ చేశారు. దీనితో ఈ సాయంత్రం 6 గంటలకి వన్ సన్ వన్ మూన్ సాంగ్ ని విడుదల చేస్తున్నట్టుగా ఖరారు చేశారు. మరి సూపర్ స్టార్ కోసం ఈసారి అనిరుద్ ఎలాంటి సాంగ్ అందించాడో చూడాలి. ఇక ఈ చిత్రానికి సన్ పిక్చర్స్ నిర్మాణం వహించగా ఈ అక్టోబర్ 15న గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు