రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘రణబాలి’పై ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ఓ స్పెషల్ అనౌన్స్మెంట్ చేశారు. భారతీయ చరిత్రలో మరుగునపడిపోయిన ఒక నిజాన్ని వెలికితీసేందుకు రెండేళ్ల సుదీర్ఘ పరిశోధనతో అత్యంత ఆసక్తికరమైన డాక్యు-సిరీస్‌గా ‘రణబాలి’ని రూపొందించారు.
గత 150 ఏళ్లుగా దాచిపెట్టబడిన, మర్చిపోయిన మరియు చెప్పబడని ఒక చేదు నిజమైన చరిత్ర ఆధారంగా ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించారు. ఇప్పటివరకు మనం విన్నది కేవలం ఒక వైపు కథ మాత్రమేనని, కానీ అసలు జరిగింది అంతకంటే చాలా దారుణమైనదని తెలుపుతూ మేకర్స్ ఈ సిరీస్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేశారు. చరిత్రలో సమాధి అయిపోయిన సత్యాలను, భయంకరమైన ఘట్టాలను నేటి తరానికి పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ 4 ఎపిసోడ్ల డాక్యు-సిరీస్‌ను రూపొందించారు.
ఎప్పటికీ మరిచిపోకూడదని చాటిచెప్పే ఈ చారిత్రక కథనానికి సంబంధించి మొదటి ఎపిసోడ్ సెప్టెంబర్ 28న స్ట్రీమింగ్ కానుంది. స్పెషల్ పరిశోధనతో రూపుదిద్దుకున్న ఈ ‘రణబాలి’ డాక్యు-సిరీస్ ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
2 years of research.
150 years of forgotten history.What we were told was only one version.
What happened was far more devastating.Now, we go back to uncover what was buried, forgotten, and never spoken about.
A slice of history.
A story that deserves to be remembered.
A… pic.twitter.com/jPKAxplGPm— Mythri Movie Makers (@MythriOfficial) September 26, 2026


