న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమా షూటింగ్ సమయంలో నాని, శ్రీకాంత్‌ల మధ్య విభేదాలు వచ్చాయని, అలాగే సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా దర్శకుడి క్రమశిక్షణా రాహిత్యం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని ప్రచారం సాగింది. సక్సెస్ మీట్లో శ్రీకాంత్ మాట్లాడుతూ.. సినిమా అవుట్‌పుట్ కోసమే నానితో చిన్నపాటి అభిప్రాయభేదాలు వచ్చాయని క్లారిటీ ఇవ్వగా, తాజాగా ఈ విషయాలపై సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా పరోక్షంగా స్పందించి వార్తలకు చెక్ పెట్టారు.
సినిమా సెట్స్‌లో నటీనటులు, దర్శకులు మరియు సాంకేతిక నిపుణుల మధ్య అప్పుడప్పుడు అపార్థాలు, క్లాషెస్ రావడం సహజమేనని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. షూటింగ్ స్పాట్లో ఏం జరిగిందో అక్కడున్న వారికి మాత్రమే తెలుస్తుందని, బయటి వ్యక్తులకు పూర్తి సమాచారం ఉండదని అలాగే ప్రతీ విషయాన్ని బయటకు వచ్చి వివరించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. పెద్ద సినిమాల నిర్మాణంలో ఇలాంటి క్రియేటివ్ డిఫరెన్సెస్ కామన్, అన్నీ సినిమా మేలు కోసమే ప్రొఫెషనల్‌గా పరిష్కరించుకున్నామని ఈ వార్తలకు చెక్ పెట్టారు.


