‘ది ప్యారడైజ్’ చిత్రం నైజాం ప్రాంతంలో బలమైన కలెక్షన్స్ ను రాబడుతుంది. మూడవ రోజున కూడా, రెండో రోజు వచ్చిన వసూళ్లకు దాదాపు సమానమైన గ్రాస్ వసూళ్లను సాధించి, స్థిరమైన కలెక్షన్స్ ను రాబట్టింది. ఈ చిత్రం జీఎస్టీ మినహాయించి సుమారు రూ. 5 కోట్ల షేర్ వసూలు చేయగా, మొత్తం గ్రాస్ సుమారు రూ. 8.5 కోట్లుగా నమోదైంది. దీంతో, నైజాంలో ఈ సినిమా మొత్తం షేర్ వసూళ్లు రూ. 23 కోట్లకు చేరువయ్యాయి.
కాగా నైజాంలో ఈ సినిమా థియేట్రికల్ హక్కుల విలువ సుమారు రూ. 34-35 కోట్లు అని తెలుస్తోంది. వారాంతంలో మెరుగైన వసూళ్లను సాధించడానికి ఈ రోజు కీలకమైన రోజు. అందుకు తగ్గట్టుగానే ఈ ఆదివారం నాడు ఈ సినిమా బాగానే ప్రదర్శన చేస్తుందని టాక్. మొత్తానికి యాక్షన్ మరియు భావోద్వేగాల కలయికతో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు.
ఇక ఈ సినిమాలో మోహన్ బాబు, సొనాలీ కులకర్ణి, రాఘవ్ జుయల్, కయాదు లోహర్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేశారు.


