ఇప్పుడు దక్షిణాది సినిమా లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ సినిమానే జైలర్ 2. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో చేసిన ఈ అవైటెడ్ సీక్వెల్ పట్ల ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక విడుదల దగ్గరకి వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్, డిస్ట్రిబ్యూషన్ కూడా ముగుస్తుంది. అయితే జైలర్ 2 కి వరల్డ్ వైడ్ గా భారీ బిజినెస్ నే జరిగినట్లు తెలుస్తోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం జైలర్ 2 మొత్తంగా 350 కోట్లకి పైగానే థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.
సో వరల్డ్ వైడ్ గా 650 నుంచి 700 కోట్ల మేర గ్రాస్ వసూలు చేస్తే గట్టెక్కుతుంది అని చెప్పొచ్చు. పార్ట్ 1 వసూళ్లే 600 కోట్లకి పైగా వచ్చాయి. సో పార్ట్ 2 ఏమాత్రం వర్కవుట్ అయినా పెట్టుకున్న టార్గెట్ అందుకోవడం కష్టమేమీ కాదని చెప్పొచ్చు. సో జైలర్ 2 ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూడాలి.


