బాపు అధ్బుత సృష్టి ‘శ్రీ రామరాజ్యం’ నేటితో 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ వేడుకను శిల్ప కళా వేదికలో జరిగింది. ఈ సందర్భంగా ఈ వేడుకకు బాలయ్య బాబు, నయనతార, దర్శకరత్న దాసరి నారాయణ రావు, ఈ చిత్ర దర్శకుడు బాపు, కళా తపస్వి కె.విశ్వనాధ్, కె.రాఘవేంద్ర రావు, మూవీ మొఘల్ డాక్టర్ డి.రామానాయుడు, ప్రసాద్ లాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్, కృష్ణం రాజు మ్యూజిక్ మేస్ట్రో ఇలయరాజా, ఎస్.పి.బాలు, శ్రీకాంత్, మురళి మోహన్, తనికెళ్ళ భరణి, ఈ చిత్ర నిర్మాత సాయి బాబు మొదలగు వారు ఈ వేడుకకు హాజరయ్యారు. బాలయ్య బాబు మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులపై నమ్మకంతో ఈ చిత్రం మొదలు పెట్టారనీ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరధం పట్టరాని అన్నారు. దాసరి నారాయణ రావు గారు మాట్లాడుతూ ఎన్టీఆర్ గారు 40 ఏళ్ళ వయసులో లవకుశ చేసారు, బాలయ్య 50 ఏళ్ళ వయస్సులో శ్రీ రామరాజ్యం చేయగలిగారని అన్నారు. ఎన్నో ఏళ్ళకి గానీ ఇలాంటి చిత్రాలు రావని ఇటువంటి చిత్రాలను ఆదరించాలని కోరారు. ఎస్.పి.బాలు మాట్లాడుతూ నయనతార తన కెరీర్లో మళ్లీ ఇలాంటి సినిమా రాదు అనీ, వచ్చినా ఇంత అధ్బుతంగా చేయలేవని కొనియాడారు. నిర్మాత సాయి బాబు మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ఇంత విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
బాపు మలిచిన అధ్బుత దృశ్యకావ్యం శ్రీ రామరాజ్యం
బాపు మలిచిన అధ్బుత దృశ్యకావ్యం శ్రీ రామరాజ్యం
Published on Jan 5, 2012 11:00 PM IST
సంబంధిత సమాచారం
- ‘న్యూటన్స్ థర్డ్ లా’ రెండు రోజుల కలెక్షన్స్ !
- ‘మౌళి’ కొత్త సినిమా పై లేటెస్ట్ అప్ డేట్
- నేను సిగ్గుపడాల్సింది ఏమీ ఉంది ? – కంగనా
- ‘రామాయణ’ పై విమర్శలు.. కారణాలు అవే !
- ‘వారణాసి’ క్లైమాక్స్ లో విజువల్ మ్యాజిక్ !
- నెట్ ఫ్లిక్స్ లో ‘హృదయం మురళి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?
- క్రిష్ కొత్త సినిమా పై లేటెస్ట్ అప్ డేట్ !
- ‘కొరియన్ కనకరాజు’లో మెయిన్ హైలైట్ అదే !
- మెగాస్టార్ పాత్రల పై క్రేజీ న్యూస్ ?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ఒడిస్సీ’పై కమల్ హాసన్ ఫిదా.. ఏమన్నాడంటే..?
- టాక్ వీక్ అయినా పీక్ బుకింగ్స్ తో స్పైడర్ మ్యాన్ ర్యాంపేజ్!
- ‘రామాయణ’ ఎఫెక్ట్.. ‘టాక్సిక్’పై పెరిగిన అంచనాలు..!
- సమీక్ష : న్యూటన్స్ థర్డ్లా – స్లోగా సాగే రొటీన్ క్రైమ్ డ్రామా !
- వందల మిలియన్స్ లేవు.. ‘రామాయణ’ ట్రైలర్ కి ఇది జెన్యూన్ రెస్పాన్స్ లేక వీక్ రెస్పాన్స్?
- ‘టాక్సిక్’ ట్రైలర్ టేకోవర్ కి డేట్ ఫిక్స్.. మరోసారి యష్ డామినేషన్ కి రంగం సిద్ధం
- ఓటీటీ సమీక్ష : గట్టా కుస్తీ 2 – నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్ చిత్రం
- ‘వారణాసి’ బిగ్ అప్డేట్ నెల ఆరంభం.. మహేష్ ఫ్యాన్స్ భారీగా ఆశలు!


