
మన టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడివి శేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రాల్లో సాలిడ్ థ్రిల్లర్ “డెకాయిట్” కూడా ఒకటి. దర్శకుడు షానియేల్ డియో తెరకెక్కించిన ఈ సినిమా కోసం అడివి శేష్ చాలా కాలం గ్యాప్ తీసుకున్నప్పటికీ మంచి బ్యాంగర్ కంబ్యాక్ తాను ఇస్తున్నాడని ఈ టీజర్ తో తేలిపోయింది.
ఇది వరకే అడివి శేష్ 2.0 అని ముందే చెప్పాడు. దీనికి ఎక్కడా తగ్గకుండా తనని తాను ఈ సినిమాలో ప్రెజెంట్ చేసుకున్న విధానం ఎంత బాగుందో దానికి మించి టీజర్ లో కంటెంట్ కూడా మంచి ప్రామిసింగ్ గా ఒక థ్రిల్ రైడ్ ని ప్రామిస్ చేస్తుంది. శేష్ యాష, తన పాత్ర కొత్తగా కనిపిస్తుండగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కి కూడా సాలిడ్ రోల్ పడినట్టు కనిపిస్తుంది.
అలాగే నటుడు అనురాగ్ కశ్యప్ కూడా మంచి పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఇంకా ఈ టీజర్ లో భీమ్స్ స్కోర్ కూడా అదిరింది. సినిమాటోగ్రఫీ, మేకర్స్ నిర్మాణ విలువలు కూడా టాప్ నాచ్ లో కనిపిస్తున్నాయి. ఇలా మొత్తానికి మాత్రం వచ్చే ఏడాది ఉగాది కానుకగా సాలిడ్ ట్రీట్ ని మేకర్స్ అందించనున్నారని చెప్పాలి.
టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి