అడ్వాన్స్ సేల్స్ లో అదరగొడుతున్న ‘పంజా’!

అడ్వాన్స్ సేల్స్ లో అదరగొడుతున్న ‘పంజా’!

Published on Aug 30, 2026 5:03 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సారా జేన్ డైస్ హీరోయిన్ గా దర్శకుడు విష్ణు వర్ధన్ తెరకెక్కించిన స్టైలిష్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా ‘పంజా’ కోసం అందరికీ తెలిసిందే. అప్పట్లో ప్లాప్ గా నిలిచిన ఈ చిత్రం మళ్ళీ థియేటర్స్ లోకి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం అభిమానులు మరోసారి ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో వరల్డ్ వైడ్ గా సాలిడ్ బుకింగ్స్ తో ఈ సినిమా రాబోతుంది.

ఇలా వరల్డ్ వైడ్ గా కేవలం అడ్వాన్స్ సేల్స్ తో కోటిన్నరకి పైగా గ్రాస్ ని ఈ చిత్రం సొంతం చేసుకుంది. ఇంకా విడుదలకి రెండు రోజుల గ్యాప్ ఉంది. మరి పవన్ గత సినిమాల రేంజ్ లో ఈ సినిమా కూడా ఓపెనింగ్స్ అందుకుంటుందో లేదో చూడాలి. ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా క్రేజీ మ్యూజిక్ ఆల్బమ్ అండ్ స్కోర్ అందించగా ఆర్కా మీడియా, సంఘమిత్ర బ్యానర్స్ పై నీలిమ తిరుమల శెట్టి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, నగేష్ ముంత నిర్మాణం వహించారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు