Oh Sukumari Producer Maheshwar Reddy Mooli Interview
టాలీవుడ్ ట్యాలెంట్ హీరో తిరువీర్, అందాల భామ ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ విలేజ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఓ.. సుకుమారి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. కొత్త దర్శకుడు భరత్ దర్శన్ డైరెక్షన్‌లో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 17న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
‘ఓ..! సుకుమారి’ ఎలా ఉండబోతోంది?
గుండెల్ని హత్తుకునే ఎమోషన్స్, కడుపుబ్బా నవ్వించే కామెడీ, సరికొత్త వినోదం ఇలా అన్ని రకాల కమర్షియల్ హంగులతో వస్తోన్న పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. అవుట్‌పుట్ మాత్రం అద్భుతంగా వచ్చింది!
ఈ కథలో మిమ్మల్ని బాగా ఆకర్షించిన పాయింట్ ఏంటి?
ఈ సినిమాలో ఒక సరికొత్త ‘యూనిక్ ఎలిమెంట్’ ఉంది. ‘షాక్ కొట్టడం’ అనే కాన్సెప్ట్‌ను బేస్ చేసుకుని రాసుకున్న కామెడీ సీన్స్, ఎమోషన్స్ చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. థియేటర్లలో ప్రేక్షకులకు ఇది ఒక సరికొత్త ఫీల్-గుడ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది.
ఈ చిత్రంలో తిరువీర్, ఐశ్వర్య రాజేష్‌లను ఎంపిక చేయడానికి కారణం?
మా కథకు వీరిద్దరి కాంబినేషన్ పర్ఫెక్ట్ ఆప్షన్ అనిపించింది. ముఖ్యంగా ఐశ్వర్య రాజేష్ రోల్ చాలా కీలకం కావడంతో, ఆమె కోసం మూడు నెలలు నిరీక్షించాం. ‘సంక్రాంతికి వస్తున్నాం’ భారీ విజయం సాధించిన తర్వాత ఆమెను సంప్రదించాం. తను ప్రాజెక్ట్‌లోకి వచ్చిన తర్వాతే షూటింగ్ స్టార్ట్ చేశాం.
పాన్ ఇండియా రిలీజ్ వెనుక ఉన్న వ్యూహం ఏమిటి?
కథలో ఉన్న బలం, నటీనటుల ఇమేజ్‌ని బట్టి ఈ నిర్ణయం తీసుకున్నాం. తిరువీర్ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు, అలాగే ఐశ్వర్య రాజేష్ వల్ల తమిళంలోనూ మంచి మార్కెట్ ఉంది. ఏ భాష వారికైనా నచ్చే అద్భుతమైన కంటెంట్ ఈ సినిమాలో ఉంది. థియేట్రికల్ రిలీజ్‌తో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్లోబల్ ఆడియన్స్‌ని రీచ్ అవ్వాలన్నదే మా లక్ష్యం.
కథలోని మెయిన్ హైలైట్ లేదా ప్రత్యేకత గురించి చెప్పండి?
పల్లెటూరి నేపథ్యంలో సాగే హార్ట్ టచింగ్ ఎమోషన్స్‌తో పాటు ఇందులో ఒక యూనిక్ పాయింట్ ఉంది. కథలో చూపించిన ‘షాక్ కొట్టడం’ అనే ఎలిమెంట్ వెనుక ఒక ప్రాక్టికల్ లాజిక్ కనిపిస్తుంది. సాధారణంగా ప్రతి మనిషి శరీరంలో కొంత ఎలక్ట్రిక్ ఎనర్జీ ఉంటుంది. అయితే, అది అందరిలో ఒకేలా ఉండదు; ఒక్కొక్కరిలో ఒక్కో స్థాయిలో ఉంటుంది. ఇదే అంశాన్ని ఎంచుకుని, దానికి అద్భుతమైన వినోదాన్ని, భావోద్వేగాలను జోడించి ఈ సినిమాను తెరకెక్కించాం.
జూలై 17న క్లాష్ ఉండబోతోంది కదా, బాక్సాఫీస్ పోటీని ఎలా తట్టుకోబోతున్నారు?
చిత్ర పరిశ్రమలో పోటీ అనేది కొత్తేమీ కాదు. ప్రతి వారం మల్టిపుల్ రిలీజెస్ కామన్. అయితే, చివరికి ఏది మంచి సినిమా అయితే అదే నిలబడుతుంది. ఆడియన్స్‌కు కనెక్ట్ అయితే ఎంత పోటీ ఉన్నా థియేటర్లకు వచ్చి చూస్తారు. మా సినిమాలోని వినోదం, కొత్తదనం ప్రేక్షకులను ఖచ్చితంగా మెప్పిస్తుందని ఆశిస్తున్నాం.
ఈ సినిమాకు సంగీతం ఎంతవరకు ప్లస్ కాబోతోంది? మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పండి?
ఆస్కార్ విజేత కీరవాణి గారి దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన భరత్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. లెజెండరీ మ్యూజిక్ స్కూల్ నుండి రావడం వల్లో ఏమో.. సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఇచ్చారు. ప్రతి సిట్యుయేషన్‌ను తన మ్యూజిక్‌తో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు. టాలీవుడ్‌లో భరత్‌కు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది, ఈ సినిమాతో ఆయనకు చాలా మంచి పేరు వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను.
ఫస్ట్ కాపీ చూసిన ట్రేడ్ వర్గాల టాక్ ఏంటి? ఎవరికైనా షో వేశారా?
అవును, ఫస్ట్ కాపీ సిద్ధమయ్యాక పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లకు ప్రత్యేకంగా ప్రదర్శించాం. సినిమా చూసిన వారంతా అవుట్‌పుట్ పట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. కంటెంట్ చాలా బలంగా ఉందని, బాక్సాఫీస్ దగ్గర ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ, మమ్మల్ని ఎంతగానో అప్రిషియేట్ చేశారు.
మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి?
తిరువీర్‌తో ఆల్రెడీ ఇంకో సినిమా డిస్కషన్స్ నడుస్తున్నాయి. అలాగే సత్యదేవ్ గారితో ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఉంది, స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. కేవలం ప్రొడక్షనే కాదు, డిస్ట్రిబ్యూషన్ వైపు కూడా మా జర్నీ ఇలాగే కంటిన్యూ అవుతుంది.
