ఖైరతాబాద్ మహాగణపతి సన్నిధిలో ‘వేదవ్యాస్’ మూవీ టీమ్ ప్రత్యేక పూజలు

ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వేదవ్యాస్‌’. ఈ సినిమా యూనిట్ సభ్యులు హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, సమర్పకుడు కె. అచ్చిరెడ్డి, హీరో పిడుగు విశ్వనాథ్‌తో పాటు చిత్ర సహ నిర్మాత మేడపాటి శ్రీనివాస్‌ రెడ్డి, జర్నలిస్ట్ ప్రభు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

​దర్శనం అనంతరం నిర్మాత కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి గణపతి మండప నిర్వాహకులకు విరాళం చెక్కును అందజేశారు. సినిమా చిత్రీకరణ పూర్తయిందని, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు.

​ప్రస్తుత పరిస్థితులకు తగినట్లుగా కథను సిద్ధం చేసి దర్శకుడు సినిమాను తెరకెక్కించారని చిత్ర సమర్పకుడు కె. అచ్చిరెడ్డి తెలిపారు. ఆధునిక కాలం, సాంకేతికత నేపథ్యంతో పాటు వేదాలు, భారతీయ సంస్కృతి అంశాలను జోడించి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు కథానాయకుడు పిడుగు విశ్వనాథ్ చెప్పారు. సాయిప్రగతి ఆర్ట్స్ పతాకంపై కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version