కన్నడ రాకింగ్ స్టార్ యష్ ఇప్పుడు రెండు భారీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి టాక్సిక్ చిత్రం గ్రాండ్ గా ముందు విడుదల కానుండగా తర్వాత రామాయణ రాబోతుంది. అయితే వీటిలో ఈ ఆగష్టు లోనే దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన యాక్షన్ చిత్రం టాక్సిక్ పై హైప్ మాత్రం అప్పట్లో ఉన్నంత లేదు.
ఎన్నో ఏళ్ళు కితం మొదలు పెట్టిన ఈ సినిమా పలు వాయిదాలు అనంతరం వస్తుంది. ఈ గ్యాప్ లో ఉన్న హైప్ కూడా తగ్గింది. ఇక అంతా ఇపుడు రానున్న ట్రైలర్ కోసమే ఎదురు చూస్తున్నాయి. అదొక్కటే సినిమాకి సేవియర్ గా మారనుంది. ఈ ఆగష్టు 8న బెంగళూరులోకి గ్రాండ్ గా ట్రైలర్ విడుదల కానుండగా ఇది వచ్చాక ఏమన్నా హైప్ మారుతుందో లేదో చూడాలి. ఈ సినిమాలో కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్ లు హీరోయిన్స్ గా నటించగా కే వి ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణం వహిస్తున్నారు.
