హిందీలో ‘టాక్సిక్’ లేటెస్ట్ వసూళ్లు.. బ్యాడ్ టాక్ తో కూడా భారీ మార్క్ దాటేసింది

హిందీలో ‘టాక్సిక్’ లేటెస్ట్ వసూళ్లు.. బ్యాడ్ టాక్ తో కూడా భారీ మార్క్ దాటేసింది

Published on Aug 30, 2026 4:05 PM IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా రుక్మిణి వసంత్, కియారా అద్వానీ అలాగే నయనతార, తారా సుతారియా హీరోయిన్స్ గా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే ‘టాక్సిక్’. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఈ సినిమా ఊహించని విధంగా హిందిలో భారీ ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది.

కానీ మొదట రోజే సినిమా టాక్ తేడా రావడంతో వీకెండ్ వచ్చినా కూడా ఇతర సినిమాల్లా కాకుండా ఈ సినిమాకి వసూళ్లు తగ్గుతూ వస్తున్నాయి. అయినప్పటికీ భారీ మార్క్ ని ఈ చిత్రం దాటేసింది. టాక్సిక్ ఈ నాలుగు రోజుల్లో 100 కోట్ల నెట్ వసూళ్ల మార్క్ అందుకొని అదరగొట్టింది.

మొత్తంగా 112 కోట్ల నెట్ మార్క్ ని ఈ చిత్రం అందుకున్నట్టు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి. సో హిందీలో మాత్రం టాక్సిక్ బ్యాడ్ టాక్ తో కూడా ఈ రేంజ్ వసూళ్లు రాబట్టడం విశేషమే అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందించగా యష్, కే వెంకట నారాయణ నిర్మాణం వహించారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు