10 లక్షల వ్యూస్‌తో ‘అఖిల్’ టీజర్..!

10 లక్షల వ్యూస్‌తో ‘అఖిల్’ టీజర్..!

Published on Sep 6, 2015 12:49 AM IST

akhil
అక్కినేని ఫ్యామిలీలో మూడో తరం నుంచి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు అక్కినేని అఖిల్ సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ‘అఖిల్’ పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాను అన్ని విధాలా ది బెస్ట్ అనిపించేలా దర్శకుడు వి.వి.వినాయక్ హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిస్తున్నారు. అఖిల్ సినిమాను నిర్మిస్తున్న హీరో నితిన్ కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై మొదట్నుంచే విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజ్‌ను రెట్టింపు చేసేలా వర్కింగ్ స్టిల్స్, మేకింగ్ వీడియోస్ పనిచేశాయి.

ఇక నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ మధ్యే విడుదల చేసిన టీజర్, సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచేసింది. విడుదలైన వారం రోజుల్లోనే ఈ టీజర్ 10 లక్షల వ్యూస్ సాధించి అఖిల్ సినిమాకున్న క్రేజ్‌ను మరోసారి స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆస్ట్రియాలోని పలు అందమైన లొకేషన్స్‌లో రెండు పాటలను చిత్రీకరిస్తున్నారు. దీంతో సినిమా దాదాపుగా పూర్తవుతుందని తెలుస్తోంది. ఇక సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరావు జయంతి సందర్భంగా ఆడియోను విడుదల చేయనున్నారు. అక్టోబర్ 22న దసరా కానుకగా సినిమా విడుదల కానుంది.

‘అఖిల్’ టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు