“అనిమల్” సినిమాపై “12త్ ఫెయిల్” నటుడు చురకలు వైరల్

బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా చిత్రం “అనిమల్”. మరి విడుదల అయ్యాక భారీ వసూళ్లతో పాటుగా దేశ వ్యాప్తంగా ఎంతో కాంట్రవర్సీకి కూడా చూరగొన్న ఈ చిత్రం మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

ఇది వరకు బాలీవుడ్ కి చెందిన పలువురు పెద్దలే సినిమాపై కామెంట్స్ చేయగా లేటెస్ట్ గా “12త్ ఫెయిల్” సినిమా నటుడు అలాగే ప్రముఖ విద్యావేత్త అయినటువంటి వికాస్ దివ్యకృతి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇటీవల తాను మాట్లాడుతూ అనిమల్ లాంటి సినిమాలు సమాజానికి ప్రమాదకరం అన్న రీతిలో చురకలు అంటించారు.

ఈ చిత్రం సమాజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్తుంది అని తెలిపారు. అలాగే సినిమాలో రణబీర్ త్రిప్తి ల మధ్య ఉండే షూ సీక్వెన్స్ కోసం కూడా మాట్లాడారు. అలా ఓ హీరో పాత్ర బూటుని నాకమని చెప్పి యువతకి ఎలాంటి సందేశం ఇస్తుంది అని? కొందరు పరిపక్వత లేని యువత ఇలాంటి సీన్స్ చూసి తమ గర్ల్ ఫ్రెండ్స్ ని ఇలా టెస్ట్ చెయ్యరని చెప్పగలరా అని ప్రశ్నించారు.

అందుకే అనిమల్ లాంటి పాత్రలు, సినిమాలు రాకూడదు అన్నట్టుగా విమర్శించారు. దీనితో ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారగా మరోసారి అనిమల్ సినిమా కాంట్రవర్సియల్ గా మారింది. అయితే దీనిపై సందీప్ రెడ్డి వంగ ఎప్పుడైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.

Exit mobile version