బుక్ మై షోలో మెగాస్టార్ ర్యాంపేజ్.. ఏకంగా 2 మిలియన్ మార్క్..!

 Mana Shankara Vara Prasad Garu

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ( Mana Shankara Vara Prasad Garu ) టికెట్ కౌంటర్ల వద్ద తుఫాన్ సృష్టిస్తూ అసాధారణ విజయంతో దూసుకుపోతోంది. చాలాకాలం తర్వాత చిరు పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రావడం, పైగా హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం కావడంతో సినిమాపై అంచనాలు మొదటి నుంచే భారీగా ఉన్నాయి.

విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం బుక్‌మైషో పోర్టల్‌లో ఏకంగా 2 మిలియన్ పైగా టికెట్లు అమ్ముడుపోయి సంచలనం సృష్టించింది. ప్రాంతీయ తెలుగు సినిమాల చరిత్రలోనే ఈ ఘనతను అత్యంత వేగంగా సాధించిన చిత్రంగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ ( Mana Shankara Vara Prasad Garu ) రికార్డు నెలకొల్పింది.

షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ భారీ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించింది. విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో మెరిశారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటూ విజయయాత్రను కొనసాగిస్తోంది.

Exit mobile version