యంగ్ హీరో అడివి శేష్ బాలీవుడ్ హిట్ చిత్రం ‘2 స్టేట్స్’ తెలుగు రీమేక్‌లో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను నూతన దర్శకుడు దర్శకుడు వెంకట్ రెడ్డి తెరకెక్కించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ గురించి అడివి శేష్ మాట్లాడుతూ ఒరిజినల్ వెర్షన్ కన్నా తెలుగు రీమేక్ ఇంకా బెటర్ గా ఉంటుంది, రేసీగా అనిపిస్తుంది. దర్శకుడు చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్చి చేశారు అన్నారు.
మార్చి నుండి రెగ్యులర్ షాట్ కు వెళ్లనున్న ఈ చిత్రాన్ని ఎం.ఎల్.వి.సత్య నారాయణ నిర్మిస్తుండగా అడివి సీనియర్ హీరో రాజశేఖర్, జీవితల కుమార్తె శివాని ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయంకానుంది. ఇందులో ఆమె పాత్ర ఉత్తరాదికి చెందిన అమ్మాయిలా ఉంటుందతట. ఇకపోతే ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందివ్వనున్నారు. ప్రముఖ రచయితా చేతన్ భగత్ రాసిన ‘2 స్టేట్స్’ నవల ఆధారంగా ‘2 స్టేట్స్’ సినిమా నిర్మితమైన సంగతి తెలిసిందే.
