‘2000 క్రోర్ బ్లాక్‌మనీ’ ఆడియో రిలీజ్ విశేషాలు

2000-CRORE-BLACK-MONEY
వర్ష ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై పవన్ రెడ్డి నటించి, నిర్మించిన సినిమా ‘2000 క్రోర్ బ్లాక్‌మనీ’. రమేష్ ముక్కెర ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు సంగీతాన్ని కూడా సమకూర్చారు. ఓ సరికొత్త కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుక నేడు (జూన్ 3న) పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో జరిగింది. ఈ వేడుకలో సినిమా ఆడియోతో పాటు టీజర్‌ను కూడా విడుదల చేశారు.

ఇక ఈ వేడుకకు దర్శక నిర్మాత సానా యాదిరెడ్డి, టీఆర్‌ఎస్ నేత ప్రశాంత్, మాజీ మంత్రి బలరామ్ నాయక్‌లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆడియో, సినిమా మంచి విజయం సాధించాలని అతిథులు కాంక్షించారు. రమేష్ ముక్కెర సినిమాలపై ఉన్న ఆసక్తితో, కళను నమ్ముకొని సినిమాల వైపొచ్చారని, అతడి కల నెరవేరిందని, మంచి విజయంతో ఆయన తన సినీ కెరీర్‌కు మంచి బాటలు పరుచుకోవాలని పలువురు ప్రముఖులు కోరుకున్నారు. సిద్ధార్థ్, అంజలి రావు తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ సినిమాకు దివ్య, ఉదయ్‌లు సినిమాటోగ్రఫీని అందించారు.

Exit mobile version