
2014 చివరి దశకు చేరుకుంది.. మరో రెండు వారాల్లో 2014 కి బై బై చెప్పి 2015కి స్వాగతం పలకనున్నాం. ఈ 2014 లో ఇప్పటి వరకూ ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. అందులో కొన్ని సినిమాలు తెలుగు ప్రేక్షకులను విపరీతంగా మెప్పిస్తే కొన్ని మెప్పించలేకపోయాయి. వాటి గురించి పక్కన పెడితే.. 2014 ముగింపు మాత్రం చాలా ఆసక్తికరంగా ముగియనుంది. దానికి కారణం యంగ్ హీరోస్ అయిన నితిన్ మరియు వరుణ్ తేజ్ కారణం కానున్నారు.
యంగ్ హీరో నితిన్ హీరోగా – కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన మరొక రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘చిన్నదాన నీకోసం’. ఈ సినిమా డిసెంబర్ చివరి వారంలో 25వ తేదీన రిలీజ్ కానుంది. వరుస హిట్స్ అందుకొని ఫుల్ స్పీడు మీదున్న నితిన్ ఈ సినిమాతో కూడా మరో హిట్ అందుకుంటానని చాలా నమ్మకంగా ఉన్నాడు.
అలాగే నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘ముకుంద’. ఫ్యామిలీ చిత్రాల స్పెషలిస్ట్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా డిసెంబర్ 24న రిలీజ్ కానుంది. వరుణ్ తేజ్ మొదటి సినిమా కావడంతో మెగా అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఈ ఇద్దరు యంగ్ హీరోలు చివరి వారంలో బాక్స్ ఆఫీసు వద్ద ఢీ కొట్టనున్నారు. మరి ఈ ఇద్దరు యంగ్ హీరోస్ లో ఇద్దరూ బాక్స్ ఆఫీసు విజేతలుగా నిలిచి సంతోషకరంగా 2104 కి శుభం కార్డ్ వేస్తారా లేక ఇద్దరో ఎవరో ఒకరే విజయాన్ని అందుకుంటారా అనేది తెలియాలంటే మరో రెండు వారాలు వేచి చూడాల్సిందే.