గత ఏడాది వరల్డ్ వైడ్ గా ఎన్నో సినిమాలు రిలీజ్ కి వచ్చాయి. అయితే ఈ చిత్రాల్లో మంచి మ్యాడ్ ఎక్స్ పీరియెన్స్ ని థియేటర్స్ లో అందించిన సినిమా ఏది అంటే చాలా మంది చెప్పే సినిమా పేరే ‘ఎఫ్ 1’ (F 1). స్టార్ హీరో బ్రాడ్ పిట్ (Brad Pitt) ఇంకా యువ నటుడు డామ్సన్ హైడ్రిస్ (Damson Idris) లు ప్రధాన పాత్రల్లో దర్శకుడు జోసెఫ్ కోసిన్స్కి తెరకెక్కించిన ఈ మ్యాడ్ రేసింగ్ డ్రామా ఆడియెన్స్ ని థియేటర్స్ లో ఉర్రూతలు ఊగించింది.
ఇండియన్ సినిమా మార్కెట్ లో కూడా 100 కోట్లకి పైగా ఈ సినిమా రాబట్టింది. ఇక అంతే కాకుండా ఐమ్యాక్స్, డాల్బీ విజన్ లాంటి వెర్షన్ లో ఒక పీక్ ఎక్స్ పీరియెన్స్ ఈ సినిమా అందించింది అని ఇప్పటికీ చాలా మంది చెబుతారు. పైగా ఆస్కార్స్ కి కూడా నామినేట్ అయ్యింది. మరి అలాంటి క్రేజీ చిత్రానికి సీక్వెల్ అంటే డెఫినెట్ గా దీని తాలూకా ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతారు.
మరి దీనినే నిర్మాత జెర్రీ బ్రూక్ హైమర్ బీబీసీతో మాట్లాడుతూ ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఎఫ్ 1 కి సీక్వెల్ ని డెవలప్ చేస్తున్నట్టుగా తాను తెలిపారు. సో ఇది మాత్రం ఎఫ్ 1 సినిమా లవర్స్ ని బిగ్ న్యూస్ అనే చెప్పాలి. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాల్లో హైయెస్ట్ గ్రాసర్ గా ఈ సినిమా నిలిచింది. ఇక దీనికి వచ్చే సీక్వెల్ ఎలాంటి థ్రిల్స్ ని అందిస్తుందో వేచి చూడాలి.
